తక్షణమే వారిని చర్చలకు పిలవాలి

ఈనెల 5 నుంచి తమ సమస్యలు ప్రభుత్వం పరిష్కరించాలంటూ ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆర్టీసీ కార్మికుడు శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతోపై విపక్షాలన్ని ప్రభుత్వ వైఖరిపై మండిపడుతున్నాయి. అందులో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు.

Update: 2019-10-14 01:07 GMT

ఈనెల 5 నుంచి తమ సమస్యలు ప్రభుత్వం పరిష్కరించాలంటూ ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆర్టీసీ కార్మికుడు శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతోపై విపక్షాలన్ని ప్రభుత్వ వైఖరిపై మండిపడుతున్నాయి. అందులో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ఆర్టీసీ కార్మికుడు శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్యపై తనను ఎంతో కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్య దురదృష్టకరమని ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

ముందుగానే ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకుని వుంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని ఆయన పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికులు ఆవేదన తనకు అర్థం అవుతోందన్నారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ ఏర్పాటు జరిగిన తర్వాత ఘటనలు బాధకరమని శోచనీయమన్నారు. శ్రీనివాస్ రెడ్డి కుటుంబానికి నష్ట్రపరిహారం ఇవ్వగమో గానీ శ్రీనివాస్ రెడ్డిని తీసుకురాగాలమ అని ప్రశ్నించారు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వం చర్చలకు పిలవాలని సూచించారు. మరో ప్రాణం పోకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపైన ఉందని పవన్ పేర్కొన్నారు.



Tags:    

Similar News