Padi Kaushik Reddy: పాడి కౌశిక్ రెడ్డిపై ఎస్సై ఫిర్యాదు.. మరో కేసు నమోదు
Case filed against Padi Kaushik Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై మరో కేసు నమోదైంది. కొండాపూర్‌లో పాడి కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద ఆయన్ను అరెస్ట్ చేయడానికి వెళ్లినప్పుడు తవని అరెస్ట్ చేస్తే సూసైడ్ చేసుకుంటానని బెదిరించారని మాసాబ్ ట్యాంక్ ఎస్ఐ గచ్చిబౌలి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తన విధులకు సహకరించకపోగా ఆటంకం కలిగించారని ఎస్ఐ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో గచ్చిబౌలి పోలీసు స్టేషన్‌లో పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేశారు.