Online Exhibition in Hyderabad: హైదరాబాద్‌లో తొలిసారిగా ఆన్ లైన్ ఎగ్జిబిషన్.. ఎప్పటినుంచి ప్రారంభం అంటే..
Online Exhibition in Hyderabad: కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో చాలామంది ప్రజలు భయాందోళనకు గురై ఇండ్లకే పరిమితం అయ్యారు.
Online Exhibition in Hyderabad: కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో చాలామంది ప్రజలు భయాందోళనకు గురై ఇండ్లకే పరిమితం అయ్యారు. ఎంతో అవసరం అయితే కానీ ప్రజలు బయటికి రావడం లేదు. కొంత మంది వ్యక్తులైతే ఈ సమయంలో బైటికి వెళ్లి వైరస్ ను కొనితెచ్చుకోవడం దేనికని వారికి అవసరమైన వస్తువుల్ని ఆన్ లైన్‌లోనే తెప్పించుకుంటున్నారు. బట్టలు, ఇంటి సరుకులు, నిత్యావసరాలు, ఇలా ఇంటికి అవసరమైన వస్తువులు అన్నీ ఆన్ లైన్‌లోనే బుక్ చేసుకుంటున్నారు. ఇలా చేయడంతో చాలా మంది ఇంట్లోనే వుంటూ చాలా బోర్ గా ఫీలవుతున్నారు.
అలా బోర్ గా ఫీలవుతున్న వారికి అల్ హాడి ఇస్లామిక్ ఎక్స్‌పో, సూపర్ ముస్లిమా శుభవార్త తెలిపింది. రేపట్నుంచి అంటే బుధవారం నుంచి ఆన్ లైన్ ఎగ్జిబిషన్ ప్రారంభించనుంది. ఇంట్లో వుంటూ ఇంట్లోనే ఉంటూ ప్రజలు ఎంజాయ్ చేసే విధంగా మొట్టమొదటి ఆన్‌లైన్ ఎగ్జిబిషన్‌ను నిర్వహించనున్నారు.
అయితే, అన్ని ఎగ్జిబిషన్ లలో ఉన్నట్టుగానే ఇందులో కూడా ఫ్యాషన్, ఆహారం, జీవనశైలిని నేపథ్యంలో ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ఇందులో ఉపకరణాలు, అలంకరణలతో కూడిన వస్తువులు, దుస్తులు, ఆహారం, బేకరీ వస్తువులు, బిర్యానీలు కూడా అందుబాటులో ఉండనున్నాయనీ తెలిపారు. ఈ ప్రదర్శన జూలై 15 నుంచి 25 వరకు ఉంటుంది. పది రోజుల పాటు జరిగే ఈ ప్రదర్శన అంతా సరదాగా, ఆనందంగా ఉంటుందని నిర్వాహకులు చెబుతున్నారు.
ఇక ఈ ఎగ్జిబిషన్ లో చక్కగా అలంకరించిన వస్తువులను కూడా అందుబాటులో ఉంచుతున్నారు. అంతే కాదు వినియోగదారుల కోసం ఈ ఎగ్జిబిషన్‌లో 100కుపైగా డిజైనింగ్ వస్త్రాలను అందిస్తున్నారు. ఇక ఆన్లైన్ లో అందరినీ కనువిందు చేస్తూ ఎగ్జిబిషన్ అందరినీ ఆకట్టుకుంటుందని నిర్వాహకులు భావిస్తున్నారు. ఈ ఎగ్జిబిషన్‌లో షాపింగ్ చేసినవారు తమకు కావాల్సిన వస్తువును స్క్రీన్ షాట్ ద్వారా ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ నెంబర్‌కు పంపాల్సి ఉంటుంది. అప్పుడు ఆ వస్తువును సిబ్బంది హోం డెలివరీ చేస్తారని నిర్వాహకులు తెలిపారు. మరి ఇంకెందుకు ఆలస్యం రేపట్నుంచి ప్రారంభం కానున్న ఈ ఆన్ లైన్ ఎక్స్ పోపై ఓ లుక్కేయండి.