MLC Elections 2021: కొనసాగుతోన్న పట్టభద్రుల ఎన్నికల పోలింగ్‌..

MLC Elections 2021: సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరుగనుంది.

Update: 2021-03-14 03:30 GMT

Representational Image

MLC Elections 2021: మహబూబ్‌నగర్‌- రంగారెడ్డి- హైదరాబాద్‌, వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గాల ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరుగనుంది. రెండు నియోజకవర్గాల్లో 1,530 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయగా 7వేల 560 మంది సిబ్బందిని నియమించింది. జంబో బ్యాలెట్‌ బాక్సులను రూపొందించారు. మహబూబ్‌నగర్‌- రంగారెడ్డి- హైదరాబాద్‌ నియోజకవర్గంలో 5లక్షల 31వేల 268 మంది, వరంగల్‌-ఖమ్మం- నల్లగొండ నియోజకవర్గంలో 5లక్షల 05వే 565 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. రెండు పట్టభద్రుల నియోజకవర్గాల ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి తెలిపారు.

మహబూబ్‌నగర్‌- రంగారెడ్డి- హైదరాబాద్‌ నియోజకవర్గం నుంచి 93 మంది, వరంగల్‌- ఖమ్మం- నల్లగొండ నియోజకవర్గంలో 71 మంది పోటీ చేస్తున్నారని అధికారులు చెప్పారు. దీంతో పెద్దసైజు బ్యాలెట్‌ పేపర్‌ను తయారు చేశామన్నారు. పోలింగ్‌ సిబ్బంది ఇచ్చిన పెన్నుతోనే ఓటరు అభ్యర్థులకు సంబంధించిన గడుల్లో ప్రాధాన్యతా నంబర్లు వేయాల్సి ఉంటుందని తెలిపారు.

కట్టుదిట్ట భద్రతకు చర్యలు తీసుకున్నారు. ఒక్కొక్కరికీ ఓటు వేయడానికే మూడు నుంచి ఐదు నిమిషాలు పట్టే అవకాశం ఉంది. ఇందుకు కారణం రెండు నియోజక వర్గాల్లోనూ అభ్యర్థులు రికార్డు సంఖ్యలో నిలబడడం ఒకటైతే జంబో బ్యాలెట్‌ను ముద్రించడం మరొకటి. దీనికితోడు, ప్రాధాన్యత క్రమంలో ఓటు వేయాలి. పట్టభద్రుల ఎన్నికల్లో మాత్రం పోటీలో ఉన్న అభ్యర్థులను ప్రాధాన్య క్రమంలో ఎన్నుకోవాలి.పోలింగ్‌ సమయం ఎనిమిది గంటలు మాత్రమే. అందుకే, 4 గంటల్లోపు పోలింగ్‌ కేంద్రం వద్దకు వచ్చిన అందరినీ అనుమతిస్తామని అధికారులు చెబుతున్నారు

Tags:    

Similar News