వైద్యుని నిర్లక్షంతో నిండు ప్రాణం బలి

జన్మనిచ్చేది తల్లిదండ్రులైతే, అనారోగ్యంతో వున్నప్పుడు వైద్యం అందించి పునర్జన్మను ఇచ్చేది వైద్యులు. అలాంటి వైద్యులను ప్రజలు దేవునిలా భావిస్తారు.

Update: 2019-10-14 10:27 GMT

జన్మనిచ్చేది తల్లిదండ్రులైతే, అనారోగ్యంతో వున్నప్పుడు వైద్యం అందించి పునర్జన్మను ఇచ్చేది వైద్యులు. అలాంటి వైద్యులను ప్రజలు దేవునిలా భావిస్తారు. కాని కొన్ని చోట్లలో మాత్రం కొంతమంది వైద్యులు తమదగ్గరికి వైద్యం కోసం వచ్చిన రోగులను పట్టించుకోకుండానో లేక సరైన మందులు ఇవ్వకపోవడం వల్లనో రోగులు తమ ప్రాణాలు వదిలేస్తున్నారు.

ఇదే కోణంలో ఆర్‌ఎంపీ వైద్యుని నిర్లక్ష్యానికి ఓ బాలిక బలైన సంఘటన హైదరాబాద్ నగరంలో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే కాచిగూడ పోలీసు స్టేషన్‌ పరిధిలోని సుందర్‌ నగర్‌లో ఉంటున్న ఫాతిమా(11) 2 రోజులుగా స్వల్ప జ్వరంతో బాధ పడుతుంది. దీంతో ఆదివారం రాత్రి ఫాతిమాను ఆమె తల్లిదండ్రులు షిఫా క్లినిక్‌కు తీసుకెళ్లారు. ఫాతిమాను పరీక్షించిన వైద్యుడు డాక్టర్‌ షమీ ఆమెకు మందులను ఇచ్చాడు. ఆ మందులను వేసుకున్న కాసేపటికి అవి వికటించి ఫాతిమా అక్కడిక్కడే మృతి చెందింది. వైద్యుడు షమీ నిర్లక్ష్యం వల్లే ఫాతిమా మృతి చెందిందని ఆమె తల్లిదండ్రులు కన్నిరుమున్నిరవుతూ రోదించారు. వారి కుటుంబ సభ్యులు వైద్యునిపై చేసిన ఫిర్యాదుతో కాచిగూడ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 

Tags:    

Similar News