Warangal: వరంగల్‌లో క్షుద్రపూజల కలకలం

వరంగల్ జిల్లా ఇల్లందలో క్షుద్రపూజల కలకలం క్షుద్రపూజలు చేసిన గుర్తుతెలియని దుండగులు మూగజీవాలను బలి ఇచ్చిన ఆనవాలు గుర్తింపు తీవ్ర ఆందోళనకు గురవుతున్న గ్రామస్తులు

Update: 2025-11-06 12:30 GMT

Warangal: వరంగల్‌లో క్షుద్రపూజల కలకలం

వరంగల్ జిల్లాలో క్షుద్ర పూజలు కలకలం సృష్టించాయి. వర్ధన్నపేట మండలం ఇల్లంద శివారులో గుర్తుతెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేశారు. నిన్న కార్తీక పౌర్ణమి కావడంతో అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఒళ్ళు గగుర్పాటుకు గురిచేసే విధంగా పసుపు, కుంకుమ, పూలు నిమ్మకాయలతో పూజలు నిర్వహించారు. దీంతో అటుగా వెళ్లిన గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మూగ జీవాలను బలి ఇచ్చిన ఆనవాలు సైతం అక్కడ కనిపించడంతో.. ఆ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది. 

Tags:    

Similar News