బర్డ్‌ఫ్లూతో మన రాష్ట్రానికి నష్టం లేదు: ఈటల
* కేంద్రం ఎప్పుడు వ్యాక్సిన్ పంపినా వ్యాక్సినేషన్ చేసేందుకు సిద్ధం- ఈటల * నేనే తొలి వ్యాక్సిన్ వేసుకుంటాను- ఈటల
Atala Rajender (file image)
తెలంగాణలో వ్యాక్సినేషన్‌కు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు మంత్రి ఈటల రాజేందర్. రెండో దశ వ్యాక్సిన్ డ్రై రన్ విజయవంతమైందన్నారు. రోజుకు పది లక్షల మందికి వ్యాక్సిన్ వేయటమే లక్ష్యమన్న ఈటల తొలి వ్యాక్సిన్ తానే వేసుకుంటానని తెలిపారు. రాష్ట్రంలో కొత్త స్ట్రెయిన్ గురించి భయం లేదన్నారు. ఇక బర్డ్‌ఫ్లూతో రాష్ట్రానికి వచ్చిన నష్టం ఏమీ లేదని ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు ఈటల.