Meerpet: మీరపేట్‌లో నూతన ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ప్రారంభం
హైదరాబాద్ లోని మీర్ పేట్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్.. కొత్త కార్యాలయాన్ని ప్రారంభించిన ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ దశరథ రాష్ట్రంలో 14 ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లు.. మంజూరు చేసిన తెలంగాణ ప్రభుత్వం
Meerpet: మీరపేట్‌లో నూతన ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ప్రారంభం
మీర్ పేట్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ కొత్త కార్యాలయాన్ని.. ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ దశరథ ప్రారంభించారు. ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ప్రభుత్వం.. కొత్త ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ లను ఏర్పాటు చేసిందని ఆయన చెప్పారు. ప్రొహెబిషన్ మరియు ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ పునర్ వ్యవస్తీకరణలో బాగంగా రాష్ట్రంలో 14 ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లు మంజూరు చేసింది తెలంగాణ ప్రభుత్వం. దీనిలో భాగంగా సరూర్ నగర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ రెండుగా విభజింపబడింది. మీర్ పేట ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ నూతన భవనం ఏర్పాటు అయ్యేంత వరకు.. సరూర్ నగర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ లోనే కొన్ని ఏర్పాటు చేశామని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ తెలిపారు.