Neelam Madhu: తనకు అండగా నిలవాలని ఆర్.కృష్ణయ్యను కోరిన నీలం మధు
Neelam Madhu: నీలం మధుకు మద్దతు తెలిపిన ఆర్.కృష్ణయ్య
Neelam Madhu: తనకు అండగా నిలవాలని ఆర్.కృష్ణయ్యను కోరిన నీలం మధు
Neelam Madhu: బీసీలు అందరూ ఏకమై మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని జాతీయ బీసీ సంఘం నేత, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య కోరారు. హైదరాబాద్‌లోని ఆర్.కృష్ణయ్య నివాసానికి వెళ్లిన ఎంపీ అభ్యర్థి నీలం మధును సాదరంగా స్వాగతించి అభినందించారు. ఎంపీ ఎన్నికల్లో పూర్తి సహాయ, సహకారాలు అందించి..తనకు అండగా నిలవాలని ఆర్ కృష్ణయ్యను నీలం మధు కోరారు. దశాబ్దాలుగా మెదక్ ప్రాంతంలో బీసీలకు అవకాశం దక్కలేదని.. ఇప్పుడు బీసీ సామాజిక వర్గానికి చెందిన నీలం మధుకు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసే అరుదైన అవకాశం రావడం హర్షనీయమన్నారు ఆర్.కృష్ణయ్య. బీసీతో పాటు ఇతర సామాజికవర్గాలకు చెందిన వారందరూ ఐక్యమై మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధుని పార్లమెంటుకు పంపించాలని ఆయన కోరారు. మధును పార్లమెంటుకు పంపితే ఆయన మద్దతు తీసుకొని దేశవ్యాప్తంగా బీసీల హక్కుల కోసం పోరాడుతామన్నారు ఆర్. కృష్ణయ్య.