Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్ట్ తనిఖీకి కమిటీ ఏర్పాటు చేసిన NDSA
Kaleshwaram Project: డ్యామేజ్‌కు గల కారణాలను పూర్తిస్థాయిలో పరిశీలించనున్న కమిటీ
Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్ట్ తనిఖీకి కమిటీ ఏర్పాటు చేసిన NDSA
Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్ట్‌లోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల డిజైన్లు, నిర్మాణాల అధ్యయనానికి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీని నియమించింది. సెంట్రల్ వాటర్ కమిషన్ మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ చైర్మన్‌గా ఐదుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ సభ్యులుగా విద్యార్థి, పాటిల్, శివకుమార్ శర్మ, రాహుల్ కుమార్ సింగ్, అమితాబ్ మీనా ను నియమించింది. నాలుగు నెలల్లో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి ఈ కమిటీ రిపోర్టును సమర్పించనుంది. మూడు బ్యారేజీల డిజైన్లు, నిర్మాణాల తీరు, డ్యామేజ్‌కు గల కారణాలను ఈ కమిటీ పూర్తి స్థాయిలో పరిశీలించనుంది.