కర్ణాటకలో తొలి ఎక్స్‌ప్రెస్‌ హైవేకు ప్రధాని ప్రారంభోత్సవం

* మైసూర్-బెంగళూరు మధ్య 118 కి.మీ. మేర హైవే నిర్మాణం

Update: 2023-03-12 11:27 GMT

కర్ణాటకలో తొలి ఎక్స్‌ప్రెస్‌ హైవేకు ప్రధాని ప్రారంభోత్సవం

Karnataka: కర్ణాటకలో మొట్టమొదటి ఎక్స్ ప్రెస్ హైవే రోడ్డును మాండ్య జిల్లాలో ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. మైసూరు మహరాజు కృష్ణరాజ వడయార్, సర్ ఎం విశ్వేశ్వరయ్య వల్లే ఈ ప్రాంత్రం ఇంత అభివృద్ది చెందుతోందన్నారు. వీరిద్దరూ గతంలో ఎన్నో కలలు కన్నారని, ఇప్పుడు వారి కలలు నేరవేరాయనీ మోడీ చెప్పారు. ఈ నేలను అభివృద్ది చెయ్యాలని అనేక ప్రయత్నాలు ఇద్దరూ చేశారని అన్నారు. రాష్ట్రంలోని మైసూర్-బెంగళూరు మధ్య తొలి ఎక్స్‌ప్రెస్‌వేని 118 కిలోమీటర్ల మేర నిర్మించారు. ఇది యాక్సెస్ నియంత్రిత హైవే. రెండు వైపులా సర్వీస్ రోడ్డు రెండు లేన్లు ఉన్నాయి. మొత్తం 10 లేన్ల ఎక్స్ ప్రెస్ హైవే. మైసూర్, బెంగళూరు ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణంపై యువత ఎంతో గర్వపడుతోందని మోడీ చెప్పుకొచ్చారు. 

Tags:    

Similar News