Karimnagar: హుజురాబాద్‌లో లేగ దూడకు బారసాల

Karimnagar: లేగదూడకు "భవాని" అని నామకరణం * లేగ దూడను ఊయలలో ఊపిన మహిళలు

Update: 2021-04-01 05:29 GMT

ఫైల్ ఇమేజ్ 

Karimnagar: భారతీయ సంస్కృతిలో ఆవుకు విశిష్ట స్థానం ఉంది. మనది వ్యవసాయాధార దేశం కావడంతో.. ఆవులను గోమాతగా పూజిస్తుంటారు. అందుకే రైతులు తమ పశువుల పట్ల ఎంతో ప్రేమ చూపిస్తూ.. కుటుంబ సభ్యుల్లానే వాటిని పరిగణిస్తారు. ఇంట్లో పుట్టిన లేగ దూడలనైతే అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేస్తుంటారు. ఓ రైతు కుటుంబం. తమ ఇంట్లో జన్మించిన లేగ దూడను ఊయలలో వేసి.. బారసాల నిర్వహించింది. అందంగా అలంకరించిన లేగ దూడను ఊయలలో ఊపుతూ. మహిళలు అక్షింతలు వేసి దీవించారు.

కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌లోని గోమాత సేవ సంరక్షణ సమితి ఆధ్వర్యంలో గో నామకరణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గత శివరాత్రి పర్వదినాన జన్మించిన లేగదూడకు 21వ రోజు ను పురస్కరించుకొని లేగదూడకు "భవాని" అని నామకరణం చేశారు. శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ కమిటీ సభ్యులు దూడకు అంగరంగ వైభవంగా బారసాల కార్యక్రమం నిర్వహించారు. ఆత్మీయులను అతిధులుగా ఆహ్వానించి వారి సమక్షంలో దూడకు భవాని అని నామకరణం చేశారు. ఊయలలో ఉంచి సంప్రదాయ బద్దంగా కార్యక్రమం నిర్వహించిన తీరు అందరినీ ఆకట్టుకుంది.

Tags:    

Similar News