ఖైదీ కడుపులో మేకులు, గోర్లు, ప్లాస్టిక్ వస్తువులు.. చికిత్స చేసి తొలగించిన ఉస్మానియా వైద్యులు

Prisoners Stomach: 8 రకాల మెటల్స్‌ను విజయవంతంగా తొలగించిన డాక్టర్లు

Update: 2024-01-10 05:59 GMT

ఖైదీ కడుపులో మేకులు, గోర్లు, ప్లాస్టిక్ వస్తువులు.. చికిత్స చేసి తొలగించిన ఉస్మానియా వైద్యులు

Prisoners Stomach: చంచల్‌గూడ జైలులో ఖైదీగా ఉన్న 21 ఏళ్ల మహమ్మద్‌ సొహైల్‌ కడుపులో ఉన్న 8 రకాల మెటల్స్‌ను ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు విజయవంతంగా తొలగించి ప్రాణాలను కాపాడారు. జైలులో ఉన్న సొహైల్‌ గత కొంత కాలంగా కడుపు నొప్పితో భాధ పడుతూ ఉండటంతో జైలు అధికారులు ఉస్మానియా ఆస్పత్రికికి చికిత్స నిమిత్తం తరలించారు. జనరల్‌ సర్జరీ విభాగం యూనిట్‌-7 డాక్టర్‌ రోగిని పర్యవేక్షించి మెడికల్‌ గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగానికి రిఫర్‌ చేశారు. గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగం హెచ్‌ఓడీ రోగికి ఎక్స్‌రే తీయించగా కడుపులో మేకులు, గోర్లు, ప్లాస్టిక్‌ వస్తువులు, మెటల్‌ ఉన్నట్లు గుర్తించారు. సుమారు గంట పాటు శ్రమించి ఎండోస్కోపి సహాయంతో వాటిని తొలగించారు. ప్రస్తుతం రోగి పూర్తిగా కోలుకొని ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

Tags:    

Similar News