వికారాబాద్ జిల్లాలో వింత వ్యాధి కలకలం
* 20 మందికి అస్వస్థత, ఆస్పత్రికి తరలింపు * ఒకరు మృతి, మరొకరి పరిస్థితి విషమం * నవాబుపేట మండలం చిట్టిగిద్దలో ఘటన
Vikarabad (reprasenttional image)
వికారాబాద్ జిల్లాలో వింత వ్యాధి కలకలం రేపుతోంది. నవాబుపేట మండలం చిట్టిగిద్దలో వింత వ్యాధితో 20 మంది అస్వస్థతకు గురయ్యారు. హుటాహుటిన వారిని స్థానికులు దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. కల్తీ కల్లు తాగడం వల్లే అస్వస్థతకు గురయ్యారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు.