మూన్నాళ్ళ ముచ్చటైన పదవి!

Update: 2019-07-03 05:52 GMT

పదవి దక్కించుకున్న ఆనందం ఆమెకు బాధ్యతలు స్వీకరించకముందే ఆవిరైంది. పార్టీ విప్ దిక్కరించిన ఫిర్యాదుతో ఆమె ఎంపీటీసీ సభ్యత్వాన్ని రద్దు చేశారు. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం ధర్మారెడ్డి ఎంపీటీసీ సభ్యురాలు కాముని కృష్ణవేణికి ఈ విచిత్ర పరిస్థితి ఎదురైంది. నాగిరెడ్డి మండలంలో 10ఎంపీటీసీ స్థానాలుండగా... టీఆర్ఎస్ 2, కాంగ్రెస్ 5 , స్వతంత్రులు 3స్థానాల్లో విజయం సాధించారు. ఆరుగురు సభ్యుల మద్దతుతో కాంగ్రెస్ ఎంపీపీ పీఠాన్ని కైవసం చేసుకుంటుందని అంతా భావించారు. కాంగ్రెస్ నుంచి గెలిచిన ధర్మారావుపేట ఎంపీటీసీ సభ్యురాలు కృష్ణవేణి టీఆర్ఎస్ సభ్యుల మద్దతుతో ఎంపీపీ బరిలో నిలిచింది. కాంగ్రెస్, టీఆర్ఎస్‌కు సమాన ఓట్లు రావడతో లారీలో.. కృష్ణవేణికి ఎంపీపీ పదవి వరించింది. విప్ దిక్కరించిన ఫిర్యాదుతో బాధ్యతలు చేపట్టకుండానే... ఆమె ఎంపీటీసీ సభ్యత్వం రద్దు చేస్తూ ఎన్నికల అధికారులు ప్రకటించారు. పదవీ బాధ్యతలు చేపట్టకుండానే ఎంపీటీసీ సభ్యత్వం రద్దు కావడం చర్చనీయాంశంగా మారింది.  

Tags:    

Similar News