Viral: స్కూటీ నడుపుతుంటే చేతిపైకి ఎక్కిన పాము.. వెంటనే బండి దిగి పరుగు పెట్టిన వ్యక్తి
Viral: వర్షాకాలంలో ఎక్కడబడితే అక్కడ పాములు కనిపిస్తూ ఉంటాయి. తాజాగా ఒక స్కూటీపైన వెళ్తున్న వ్యక్తి చేతులపైకి ఒక పాము ఎక్కింది.. ఇంకేముందు రోడ్డు మధ్యలోనే బండి వదిలేసి.. ఒక్కసారిగా బయటకు దిగేశాడు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
Viral: స్కూటీ నడుపుతుంటే చేతిపైకి ఎక్కిన పాము.. వెంటనే బండి దిగి పరుగు పెట్టిన వ్యక్తి
వర్షాకాలంలో ఎక్కడబడితే అక్కడ పాములు కనిపిస్తూ ఉంటాయి. తాజాగా ఒక స్కూటీపైన వెళ్తున్న వ్యక్తి చేతులపైకి ఒక పాము ఎక్కింది.. ఇంకేముందు రోడ్డు మధ్యలోనే బండి వదిలేసి.. ఒక్కసారిగా బయటకు దిగేశాడు. ఈ సంఘటన అంబర్ పేట పరిధిలో జరిగింది. వివరాల్లోకి వెళితే..
షూలు, బైక్స్, ఏసీలు, ఫ్రిజ్‌లు.. ఇలా ఎక్కడ సంధుంటే అక్కడ ఈ మధ్య పాములు దూరుపోతున్నాయి. అయితే ముందే ఈ పాములను గుర్తించడంతో పెద్ద పెద్ద ప్రమాదాల నుండి జనం బయటపడ గలుగుతున్నారు. తాజాగా అంబర్ పేటలో ఇలాంటి ఒక సంఘటన జరిగింది. అప్పటికే బండిలో ఉన్న పాము.. బండి నడుపుతున్న వ్యక్తి చేయి ఎక్కబోయింది. దీంతో అతను బండిని వదిలేసి పరుగులు తీసాడు.
అంబర్ పేటలోని పటేల్ నగర్‌లో నివాసం ఉండే ఓ వ్యక్తి ఉదయం సమయంలో ఆజాద్ నగర్ మీదుగా అలీ కేఫ్ చౌరస్తా వైపు వెళ్తున్నాడు. అప్పుడు ఆజాద్ నగర్ మదర్సా వద్దకు రాగానే అతని చేతిపైకి ఏదో పాకుతున్నట్టు అనిపించి చేయి చూసుకున్నాడు. వెంటనే చేతిని చేతికి కిందకు విసిరగా తన చేతుపై ఉన్ పాము కూడా కింద పడింది. వెంటనే బండిని రోడ్డు మధ్యలోనే ఆపేసి అక్కడ నుంచి దూరంగా వెళ్లిపోయాడు.
అయితే కింద పడిన పాము మళ్లీ అతని స్కూటీలోకి దూరిపోయింది. ఇక చాలాసేపు రోడ్డుపైనే ఈ బండి ఉండిపోవడంతో పాము కూడా అందులోనే ఉండిపోయింది. అటూ ఇటు తిరుగుతున్న వాహనదారులు, పాదచారులు ఒకసారి ఆగి , పాముని చూసి మరీ వెళ్లారు. ఆ తర్వాత కాసేపటికి స్నేక్ క్యాచర్‌ని పిలిచారు. ఆ తర్వాత స్నేక్ క్యాచర్ వచ్చి పాముని బయటకు తీయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే అదృష్టం ఏంటంటే ఆ వాహనదారుడ్ని పాము కాటేయలేదు. అందుకే పెను ప్రమాదం తప్పింది.