Corona Scare in Kamareddy: తల్లీ కొడుకులను వెలివేసిన గ్రామస్థులు..ఎందుకో తెలుసా..

Corona Scare in Kamareddy: దేశం మొత్తం కరోనా తో పోరాడుతుంది. కానీ గుర్తుంచుకోండి మనం పోరాడాల్సింది వ్యాధితో..రోగితో కాదు.

Update: 2020-07-04 13:15 GMT

Corona Scare in Kamareddy "దేశం మొత్తం కరోనా తో పోరాడుతుంది. కానీ గుర్తుంచుకోండి మనం పోరాడాల్సింది వ్యాధితో..రోగితో కాదు. వారిని వివక్షతతో చూడకండి, వారిని పరిరక్షించండి" .. ఇది ఎక్కడో విన్నట్టు ఉందే అనిపిస్తుంది కదా. అవును పొద్దున లేవగానే ఎవరికైనా కాల్ చేస్తే చాలు రింగ్ టోన్ కి ముందుగా ఇదే వినిపిస్తుంది. ప్రభుత్వం రోగిని వివక్షతతో చూడకండి, పరిరక్షించండి అని చెపుతున్నా కొంత మందిలో మాత్రం మార్పు రావడంలేదు. ఎదుటి వారు దగ్గినా తుమ్మితే చాలు వారికి కరోనా లేకపోయినప్పటికీ దూరం పెడుతున్నారు. ఇప్పటి వరకు ఇలాంటి సంఘటనలు చాలానే వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు తాజాగా మరో సంఘటన కూడా వెలుగులోకి వచ్చింది. కరోనా అనుమానంతో తల్లీకొడుకును ఆ గ్రామస్తులు ఊళ్లోకి రానివ్వకుండా గ్రామశివారులోని ఓ పాత పాఠశాల గదిలో బాధితులు ఉండాలని ఆదేశించారు. ఈ ఇద్దరు తల్లి కొడుకులకు కరోనా లక్షణాలు లేకున్నా వెలివేసి శిక్ష విధించారు. ఈ విశాదకరసంఘట బిక్కనూరు మండలం జంగంపల్లిలో వెలుగుచూసింది.

ఈ సంఘటనకు సంబంధించి పూర్తివివరాల్లోకెళితే కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండల కేంద్రంలో సుధారాణి అనే గృహిణి ఉంది. కాగా ఇటీవలి కాలంలో సుధారాణి కూతురు పురుడుపోసుకుంది. దీంతో సుధారాణి తన కూతురిని చూసేందుకు సుధారాణి తన కొడుకు రాకేష్‌తోపాటు ఆస్పత్రికి వెళ్లి వచ్చింది. కాగా సుధారాణి కూతురికి జన్మించిన శిశువుకు పరీక్షలు చేయగా కరోనా పాటిజిల్ గా నిర్ధారణ అయింది. ఈ విషయం ఆ నోటా ఈ నోటా సుధారాణి గ్రామస్థులకు తెలిసింది. దీంతో గ్రామస్తులు, సుధారాణిని ఆమె కొడుకును గ్రామంలోకి రానివ్వకుండా వెలివేసారు. తమకెలాంటి లక్షణాలు లేవని, ఇంట్లో క్వారంటైన్‌లో ఉంటామని బతిమాలినా గ్రామస్తులు వారి మాట వినిపించుకోలేదు. శిశువుకు కరోనా ఉందని తేలడంతో ఈ ఇద్దరికి కూడా కరనా వచ్చిందనే అనుమానంతో గ్రామస్థులు అమానుషంగా ప్రవర్తించారు. దీంతో తట్టుకోలేని పరిస్థితిలో గ్రామంలోని బస్టాండ్‌లో మూడు రోజులపాటు తీవ్ర ఇబ్బందులు పడిని సుధారాణి, రాకేష్‌ తీవ్ర మనోవేదనతో సెల్ఫీ వీడియోలు తీసి సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. గ్రామస్థులు మానసికంగా వేధిస్తున్నారని చనిపోయాలా ఉన్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి చర్యలుతీసుకోవాలని కోరారు. 

Tags:    

Similar News