Hyderabad: హుస్సేన్‌సాగర్‌లో దూకి రెండేళ్ల కుమార్తెతో తల్లి ఆత్మహత్య
Hyderabad: ఈనెల 2న హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌లో దూకి ఆత్మహత్యకు పాల్పడిన తల్లికూతుర్ల మృతదేహాలను గుర్తించారు.
Hyderabad: హుస్సేన్‌సాగర్‌లో దూకి రెండేళ్ల కుమార్తెతో తల్లి ఆత్మహత్య
Hyderabad: ఈనెల 2న హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌లో దూకి ఆత్మహత్యకు పాల్పడిన తల్లికూతుర్ల మృతదేహాలను గుర్తించారు. సీఏ అకౌంట్‌గా పని చేస్తున్న కీర్తిక అగర్వాల్, వ్యాపారి పృథ్వీలాల్ పాతబస్తీలో నివాసం ఉంటున్నారు. వీరికి రెండేళ్ల కుమార్తె బియ్యారా ఉంది. ఏడాదిన్నరగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో కీర్తిక బహుదూర్‌పురాలోని తల్లిదండ్రుల వద్ద ఉంటుంది. ఈనెల 2న ట్యాంక్‌బండ్‌లో కూతురుతో కలిసి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. కూతురు, మనమరాలు కనిపించడం లేదని కీర్తిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. నెక్లెస్ రోడ్ సమీపంలో కీర్తిక, బియ్యారా మృతదేహాలను పోలీసులు గుర్తించారు.