జాతి భేదాన్ని మరిచి..గెదెలతో స్నేహం చేసిన కోతి..

ఈ మధ్య కాలంలో అడవుల సంఖ్య తగ్గిపోతున్న కొలది అడవిలో ఉండవలసిన జంతువులు నగర బాట పడుతన్నాయి.

Update: 2020-03-15 08:13 GMT
Monkey making friendship with buffaloes in Nalgonda

ఈ మధ్య కాలంలో అడవుల సంఖ్య తగ్గిపోతున్న కొలది అడవిలో ఉండవలసిన జంతువులు నగర బాట పడుతన్నాయి. అందులో ముఖ్యంగ కోతులు. పల్లెలు, పట్టణాలు అన్న తేడాలేకుండా ఇష్టం వచ్చినట్టు నగరాల్లో సంచరిస్తున్నాయి. వాటికి నగరాలే అడవుల్లా అయిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఓ కోతిపిల్ల ఓ గ్రామానికి చేరుకుంది. అన్నికోతులు తమకు ఆహారం దొరగాను వెల్లిపోతాయి, కానీ ఆ కోతిపిల్ల మాత్రం తనకి ఆహారం దొరకగానే ఎక్కడికీ పోలేదు. ఆగ్రామంలో ఉన్న ఓ ఇంటి చుట్టూనే ఉంటూ ఇంటి యజమాని గేదెలతో స్నేహం చేయడం మొదలు పెట్టింది. అంతేనా ఆ గేదెలు ఎక్కడికి వెలితే ఆ కోతిపిల్ల కూడా గేదెల వెంట వాటి వీపుపై అంబారీ ఎక్కినట్టు ఎక్కి వెలుతుంది. మల్లీ వాటితోనే ఇంటికి తిరిగి వస్తుంది. వింటుంటే చాలా గమ్మత్తుగా ఉంది కదూ.

నల్గొండ జిల్లాలోని పోతునూరు అనే గ్రామంలో యాసాల వెంకటేశ్వర్‌రావు అనే అతను వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతని ఇంట్లోకి రెండు నెలల క్రితం ఓ కోతి పిల్ల వచ్చింది. అది అక్కడి నుంచి ఎక్కడికీ పోకుండా ఇంటి పరిసరాలలోనే ఉంటూ వెంకటేశ్వర్ రావు గేదెలతో సహవాసం చేస్తూ వాటితో కలిసిపోయింది.

ఇలా కొన్ని రోజులు గడిచిన తరువాత వెంకటేశ్వర్‌రావు గేదెలను మేత మేపడానికి వారి పొలాలకు తోలుకుపోయేవాడు. అప్పుడు ఆ కోతి కూడా గేదెలపై ఎక్కి వాటితోపాటుగానే పొలానికి వెల్లేది. సాయంత్రం ఇంటికొచ్చిన తరువాత ఆ యజమాని ఏమైనా పండ్లు, తినుబండారాలు ఇస్తే అవి తిని ఇంటి ఆవరణలోని వేపచెట్టుపై నిద్రించేది. ఇలా ప్రతి రోజు చేస్తూ గేదెలతో, ఇంటి యజమానితో అనుబంధాన్ని పెంచుకుంది కోతిపిల్ల. ఇక గేదెలు కూడా ఆ కొతిని ఏమీ అనడం లేదు.



Tags:    

Similar News