MLC Kavitha: సీఎం కేసీఆర్‌ను కలవనున్న ఎమ్మెల్సీ కవిత?
MLC Kavitha: ఈడీ విచారణపై కేసీఆర్‌తో చర్చించే అవకాశం
MLC Kavitha: సీఎం కేసీఆర్‌ను కలవనున్న ఎమ్మెల్సీ కవిత?
MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత కాసేపట్లో ప్రగతిభవన్‌కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. సీఎం కేసీఆర్‌ను కలిసి.. ఈడీ విచారణపై కేసీఆర్‌తో చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఢిల్లీలో ఈడీ విచారణ ఎదుర్కొన్న ఎమ్మెల్సీ కవిత మరోసారి ఈనెల 16 తేదీన హాజరు కావాలని నోటీసులిచ్చారు. వ్యక్తిగత వివరాలతో పాటు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించిన పాత్రపై ఆరా తీసినట్లు సమాచారం. తొలి రోజు దాదాపు 9 గంటల పాటు విచారించిన ఈడీ అధికారులు... ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సౌత్ గ్రూప్ పాత్రపై ఆరా తీశారు. అకౌంటెంట్ బుచ్చిబాబు, అరుణ్ పిళ్లై రిమాండ్ రిపోర్ట్ ఆధారంగా విచారించారు. విచారణతో సంతృప్తి చెందని ఈడీ అధికారులు కవితను మరోసారి విచారించాలని నిర్ణయించారు. దీంతో మరోసారి ఈనెల 16న విచారణకు రావాలని నోటీసులిచ్చారు.