MLC Kavitha: ఎమ్మెల్యే షకీల్, బీఆర్‌ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ గుండాల దాడిని ఖండిస్తున్నాం
MLC Kavitha: దాడి చేసిన వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలి
MLC Kavitha: ఎమ్మెల్యే షకీల్, బీఆర్‌ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ గుండాల దాడిని ఖండిస్తున్నాం
MLC Kavitha: బోధన్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి షకీల్‌తో పాటు బీఆర్ఎస్ కార్యకర్తలపై జరిగిన దాడిని ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్ వేదికగా తీవ్రంగా ఖండించారు. ఇది కాంగ్రెస్ గూండాల దాడిగా ఆమె ఆరోపించారు. ఓటమికి భయపడే బీఆర్ఎస్ శ్రేణులపై దాడులు చేస్తున్నారని కవిత ఫైర్ అయ్యారు. దాడి చేసిన వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 60 లక్షల గులాబీ సైన్యం ముందు మీరెంత అంటూ ట్విట్టర్ ద్వారా హెచ్చరించారు కవిత. సత్తా కలిగిన బీఆర్ఎస్ కార్యకర్తలు దాడులను ప్రజాక్షేత్రంలో దీటుగా ఎదుర్కొంటారని చెప్పారు. ఇలాంటి దాడులకు తెగబడితే కాంగ్రెస్ పార్టీకి ప్రజలే తగిన బుద్ది చెబుతారని ఎమ్మెల్సీ కవిత అన్నారు.