MLC Kavitha: మహిళల బాధను స్మృతి ఇరానీ విస్మరించారు
MLC Kavitha: ట్విట్టర్ ద్వారా అసహనం వ్యక్తం చేసిన ఎమ్మెల్సీ కవిత
MLC Kavitha: మహిళల బాధను స్మృతి ఇరానీ విస్మరించారు
MLC Kavitha: కేంద్రమంత్రి స్మృతి ఇరానీపై ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్ ద్వారా ఫైర్ అయ్యారు. మహిళల బాధను స్మృతీ ఇరానీ విస్మరించారని ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. మహిళా ఉద్యోగులకు నెలసరి సమయంలో సెలవులు ఇవ్వాలన్న ప్రతిపాదనను కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ వ్యతిరేకించడాన్ని ఎమ్మెల్సీ కవిత తప్పుబట్టారు .కేంద్ర మంత్రి వైఖరి నిరుత్సాహపరిచిందని, మహిళల బాధను కేంద్ర మంత్రి విస్మరించారని కవిత ట్విట్టర్ ద్వారా అసహనం వ్యక్తం చేశారు.