MLC Kavitha: రాహుల్ బబ్బర్ షేర్ కాదు.. పేపర్ టైగర్
MLC Kavitha: అమరుల కుటుంబాలను కలిస్తే రాష్ట్ర ప్రాముఖ్యత తెలుస్తుంది
MLC Kavitha: రాహుల్ బబ్బర్ షేర్ కాదు.. పేపర్ టైగర్
MLC Kavitha: తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటనపై విమర్శలు చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. రాహుల్ గాంధీ బబ్బర్ షేర్ కాదు..కేవలం పేపర్ టైగర్ మాత్రమే అంటూ సెటైర్లు వేశారు. తెలంగాణ పట్ల రాహుల్ కు అవగాహన లేదన్నారు. కేవలం కాంగ్రెస్ నేతలు రాసిచ్చిన స్క్రిప్ట్ మాత్రమే చదవడం కాకుండా.. పరిస్థితుల పట్ల అవగాహన తెచ్చుకోవాలన్నారు ఎమ్మెల్సీ కవిత. రాహుల్ కు తెలంగాణ సంస్కృతి పట్ల అవగాహన లేదన్నారు. రాహుల్ మళ్లీ ఎప్పుడైనా తెలంగాణకు వచ్చినప్పుడు దోశ బండి వద్ద దోశలు వేసుకుని తినడమే కాదు.. అమరుల కుటుంబాలను కలిస్తే.. తెలంగాణ రాష్ట్ర ప్రాముఖ్యత ఏంటదనేది తెలుస్తుందన్నారు ఎమ్మెల్సీ కవిత.