MLC Kavitha: కాంగ్రెస్ పార్టీకి పదిసార్లు అవకాశమిచ్చినా ఏమీ చేయలేదు
MLC Kavitha: మరోసారి అవకాశమివ్వాలని అడగడం విడ్డూరంగా ఉంది
MLC Kavitha: కాంగ్రెస్ పార్టీకి పదిసార్లు అవకాశమిచ్చినా ఏమీ చేయలేదు
MLC Kavitha: బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను నమ్మి మోసపోవద్దని, కాంగ్రెస్ పార్టీ తేలు వంటిదని అన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత... నిజామాబాద్ జిల్లా నందిపేట్‌లో మున్నూరు కాపుల ఆత్మీయ సమ్మేళనంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ఆ రెండు పార్టీలు ప్రజల గురించి ఎప్పుడూ ఆలోచించవని ఆరోపించారు. పదిసార్లు అవకాశం ఇచ్చినా.. ఏమీ చేయని కాంగ్రెస్ పార్టీ మరోసారి అవకాశం ఇవ్వాలని అడగడం విడ్డూరంగా ఉందన్నారామె. చెప్పినవి చెప్పినట్లు చేస్తున్న బీఆర్ఎస్‌ను నమ్ముదామా... లేక కొత్త కథలు చెబుతున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను నమ్ముదామా? అని ఆమె మహిళలను ప్రశ్నించారు. నిత్యం తెలంగాణ ప్రజల బాగు కోసం ఆలోచించే సీఎం కేసీఆర్‌ను ఆశీర్వదించాలని, ఆర్మూర్ బీఆర్ఎస్ అభ్యర్థి జీవన్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కవిత పిలుపునిచ్చారు.