MLC Eelction: నేడు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్
MLC Eelction: సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్
MLC Eelction: నేడు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్
MLC Eelctions: తెలంగాణలో హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానానికి ఓట్ల లెక్కింపు జరగనుంది. హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానానికి సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 13న పోలింగ్ జరిగిన మహబూబ్‌నగర్ – రంగారెడ్డి– హైదరాబాద్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. కౌంటింగ్ కోసం 28 టేబుల్స్ ఏర్పాటు చేశారు. వివిధ పోలింగ్ కేంద్రాల నుండి వచ్చిన బ్యాలెట్ బాక్స్ లోని బ్యాలెట్ పేపర్స్ ను మొదటగా బండిల్స్ తయారు చేసి.. అవన్నీ మిక్సింగ్ చేసిన తర్వాత ప్రతి టేబుల్ వైజ్ గా పంపిణీ చేసి కౌంటింగ్ ప్రారంభించనున్నారు.