Raja Singh: ఒవైసీ సోదరులపై రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు
Raja Singh: బీజేపి అధికారం లోకి వచ్చాక ఎంఐఎం నేతలను పాకిస్థాన్ పంపిస్తాం
ఒవైసీ సోదరులపై ఎమ్మెల్యే రాజా సింగ్ కీలక వ్యాఖ్యలు (ఫైల్ ఇమేజ్)
Raja Singh: బీజేపి అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రలో గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపి అధికారంలోకి వచ్చాక ఎంఐఎం నేతలను పాకిస్థాన్ పంపించేస్తామన్నారు. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ల కాళ్లు పట్టుకోడం ఒవైసీ సోదరులకు అలవాటేనని విమర్శించారు. గోషామహల్ అభివృద్ధి కోసం కేసీఆర్ రెండు వేల కోట్లు కేటాయిస్తే రాజీనామా చేస్తానని అన్నారు. టీఆర్ ఎస్ ఎన్ని డబ్బు సంచుల మూటలు పంచినా హుజూరాబాద్ లో గెలిచేది ఈటల మాత్రమేనన్నారు. GHMC ఎన్నికల్లో టీఆర్ ఎస్ డబ్బులు పంచితే జనం ఆ డబ్బు తీసుకుని బీజేపికి ఓటేశారన్నారు.