Maganti Gopinath: విషమంగానే ఎమ్మెల్యే మాగంటి ఆరోగ్యం..వెంటిలేటర్ పై చికిత్స

Maganti Gopinath: జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత మాగంటి గోపీనాథ్ ఆరోగ్యం విషమంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

Update: 2025-06-07 02:10 GMT

Maganti Gopinath: జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ కన్నుమూత

Maganti Gopinath: జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత మాగంటి గోపీనాథ్ ఆరోగ్యం విషమంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆయనకు వైద్యులు వెంటిలేటర్ పై చికిత్సను అందిస్తున్నారు. గురువారం గోపినాథ్ తన ఇంట్లో ఆకస్మాత్తుగా గుండెపోటుకు గురికావడంతో కుటుంబ సభ్యులు వెంటనే గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. అప్పటి నుంచి ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు.

కార్డియాక్ అరెస్ట్ అవ్వడం వల్ల సీపీఆర్ తో తిరిగి గుండె కొట్టుకోవడంతోపాటు నాడి సాధారణ స్థితికి వచ్చినా..ఇంకా అపస్మారక స్థితి నుంచి ఆయన బయటకు రాలేదు. కొంత సమయం గడిస్తే కానీ ఏమీ చెప్పలేమని వైద్యులు చెబుతున్నారు. నిపుణులైన వైద్య బ్రుందం 24గంటలూ పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. మంత్రి శ్రీధర్ బాబు ఆసుపత్రిలో గోపినాథ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. గోపీనాథ్ తనకు సన్నిహితుడని, ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. గోపీనాథ్ కుటుంబ సభ్యులకు తోడుగా ఆసుపత్రిలో కేటీఆర్ సతీమణి శైలిమ కూడా ఉన్నారు. ఎమ్మెల్యే ఆరోగ్య పరిస్థితిని ఆమె ఎప్పటికప్పుడు కేటీఆర్ కు తెలియజేస్తున్నారు. 

Tags:    

Similar News