MLA Ramesh Babu: చెన్నమనేని రమేశ్ బాబుకు కీలక పదవి..!
MLA Ramesh Babu: వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబుకు తెలంగాణ ప్రభుత్వం కీలక పదవి ఇచ్చింది.
MLA Ramesh Babu: చెన్నమనేని రమేశ్ బాబుకు కీలక పదవి..!
MLA Ramesh Babu: వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబుకు తెలంగాణ ప్రభుత్వం కీలక పదవి ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారుగా నియమించింది. కేబినెట్ హోదా కలిగివున్న ఈ పదవిలో వీరు ఐదేండ్ల కాలం పాటు కొనసాగనున్నారు. సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనున్నది. కాగా విద్యాధికుడైన డాక్టర్ చెన్నమనేని రమేశ్ బాబు.. జర్మనీకి చెందిన ప్రతిష్టాత్మక ‘హంబోల్ట్ యూనివర్శిటీ’ నుంచి ‘అగ్రికల్చర్ ఎకనామిక్స్’లో పరిశోధనలు చేసి పీహెచ్‌డీ పట్టాను పొందారు.
రాష్ట్ర వ్యవసాయ రంగం దినదినాభివృద్ధి చెందుతూ దేశంలోనే నెంబర్ వన్ స్థానానికి చేరుకుంటున్న నేపథ్యంలో… వీరికి అగ్రికల్చర్ ఎకానమి అంశం పట్ల వున్న అపారమైన అనుభవం, విస్తృత జ్జానాన్ని రాష్ట్ర రైతాంగం, వ్యవసాయాభివృద్ధి కోసం వినియోగించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే చెన్నమనేని ముఖ్యమంత్రి కేసీఆర్ సలహాదారుగా వ్యవహరించనున్నారు.