Mission Bhagiratha Scheme Employees Protest: వర్క్‌ ఇన్‌స్పెక్టర్లు, జూనియర్‌ అసిస్టెంట్ల మెరుపు ధర్నా.

Mission Bhagiratha Scheme Employees Protest: మిషన్ భగీరథ నీటిని ప్రజలందరికీ అందించడానికి అహర్నిషలూ కష్టపడిన ఎంతో మంది ఉద్యోగులను ప్రభుత్వం ఉన్న పలంగా ఉద్యోగాల నుంచి తీసివేసింది.

Update: 2020-07-21 06:01 GMT
నిరసన తెలుపుతున్న మిషన్ భగీరథ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు

Mission Bhagiratha Scheme Employees Protest: రాష్ట్రంలోని ప్రజలెవ్వరూ తాగు నీటి కోసం ఇబ్బందులు పడకూడదని రాష్ట్ర సీఎం కేసీఆర్ మిషన్‌ భగీరథ పథకానికి ప్రారంభించి గ్రామగ్రామాన గోదావరి నీటిని అందించారు. అయితే ఈ మిషన్ భగీరథ నీటిని ప్రజలందరికీ అందించడానికి అహర్నిషలూ కష్టపడిన ఎంతో మంది ఉద్యోగులను ప్రభుత్వం ఉన్న పలంగా ఉద్యోగాల నుంచి తీసివేసింది. దీంతో మిషన భగీరథ కేంద్ర బిందువుగా ఉన్న సీఎం కేసీఆర్‌ సొంత ప్రాంతం సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లోని కోమటిబండ మిషన్‌ భగీరథ గుట్టపై సోమవారం కలకలం రేగింది. భగీరథ పథకం ఔట్‌సోర్సింగ్‌ వర్క్‌ ఇన్‌స్పెక్టర్లు, జూనియర్‌ అసిస్టెంట్లు ఇలా 200 మందికిపైగా ఉద్యోగులు రాష్ట్రం నలుమూలల నుంచి మిషన్‌ భగీరథ హెడ్‌వర్క్స్‌కు చేరుకున్నారు. వివిధ దారుల్లో అక్కడికి చేరుకున్న ఉద్యోగులు ఒక్కసారిగా మెరుపు ఆందోళనకు దిగారు. తమను విధుల నుంచి తొలగించారని, మళ్లీ విధుల్లోకి తీసుకోవాలని ఓవర్‌హెడ్‌ ట్యాంకులపైకి ఎక్కి ప్లకార్డులతో నినాదాలు చేస్తూ ఆ ప్రాంతాన్ని హోరెత్తించారు. ఈ విషయం సీఎం కేసీఆర్‌ దృష్టికి వెళ్లేలా తమ నిరసనను చేసారు.

ఈ నిరసనలు మథ్యాహ్నం నుంచి మొదలుకుని రాత్రి 7గంటల వరకు కొనసాగడంతో పోలీసు, మిషన్‌ భగీరథ అధికారులు, రెవెన్యూ అధికారులు ఉరుకులు, పరుగులు పెటాల్సి వచ్చింది. ఆ తరువాత అక్కడికి చేరుకున్న పోలీసులు నిరసన తెలుపుతున్న నచ్చజెప్పారు. తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఆందోళన చేపట్టిన ఉద్యోగులపై ఎలాంటి కేసులు నమోదు చేయమని హామీ ఇవ్వడంతో వారు స్వచ్ఛందంగా ట్యాంకుల పైనుంచి కిందకు దిగారు. అనంతరం వారిని బేగంపేట పోలీస్‌ స్టేషన్‌కు తరలించి సొంత పూచీకత్తుపై విడుదల చేశారు.

2015లో రాష్ట్రవ్యాప్తంగా 709 మందిని మిషన్‌ భగీరథ పథకంలో ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిన పనిచేయడానికి ఎంపిక చేశారు. వారిలో 662 మంది వర్క్‌ ఇన్‌స్పెక్టర్లుగా, 47 మంది జూనియర్‌ అసిస్టెంట్లుగా పనిచేస్తున్నారు. ఇక ప్రతి ఏడాది వీరి పోస్టులను రెన్యువల్‌ చేయాల్సి ఉండగా, ఈ ఏడాది మార్చి 31న వీరిని రెన్యువల్‌ చేయాల్సింది. సరిగ్గా అదే సమయంలో అంటే జూన్‌ 30 వరకు అలాగే విధుల్లో కొనసాగించి జూలై 1 నుంచి విధుల్లోకి రావొద్దంటూ ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చారు. దీంతో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు ఆందోళనగు గురై నిరసనను తెలుపుతున్నారు.


Tags:    

Similar News