వృద్ధురాలికి మంత్రి సాయం

Update: 2020-04-17 08:44 GMT

కరోనా వైరస్ అంతకంతకు విస్తరిస్తోంది. దీంతో మాస్కులు ధరించడం తప్పనిసరి అయ్యింది. దేశంలోనే చాలా రాష్ట్రాలు మాస్క్ లు లేకుండా బ‌య‌ట‌కు వ‌స్తే చ‌ర్య‌లు తీస‌కుంటామ‌ని హెచ్చ‌రించిన సంగ‌తి తెలిసిందే. బ్యాంకులో వ‌య‌సు పైబ‌డిన ఓ మ‌హిళ మాస్క్ పెట్టుకోకుండా క‌నిపించ‌డంతో ఆమెకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ అవగాహన కల్పించారు. తెల్లరేషన్ కార్దుదారుల ఖాతాల్లో రూ.1500 జమకావడంతో మహబూబ్ నగర్‌లోని బ్యాంకులకు జనాల తాకిడి పెరిగింది. డబ్బులు విత్ డ్రా చేసేందుకు స్థానికులు తరలివచ్చారు. వారిలో కొందరికి మాస్క్‌లు లేకపోవడంతో మంత్రి శ్రీనివాస్ గౌడ్ అవగాహన కల్పించారు. ఎస్‌బీఐ బ్యాంకులో మాస్క్ ధరించని ఓ వృద్ధురాలికి ఆయన మాస్క్ అందించారు. ఐతే ఆమెకు కట్టుకోవ‌డం రాక‌పోవ‌డంతో మంత్రే స్వయంగా మాస్క్ కట్టారు.

Tags:    

Similar News