Srinivas Goud: రేవంత్‌రెడ్డి బీసీలకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నారు
Srinivas Goud: మా జాతులను కించపరిచే విధంగా మాట్లాడితే రాజకీయంగా అణిచివేస్తాం
Srinivas Goud: రేవంత్‌రెడ్డి బీసీలకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నారు
Srinivas Goud: హైదరాబాద్ రవింద్రభారతిలో సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకుల్లో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ రేవంత్‌రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్‌రెడ్డి బీసీలకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నాడని ఆయన మండిప్డడారు. బీసీలు ఎదుగుతుంటే అణిచివేసే కుట్రలు జరుగుతున్నాయన్నారు. ఉన్న ముగ్గురు బీసీ మంత్రులపై కోవర్ట్ ఆపరేషన్ చేస్తున్నారని ఆయన విమర్శించారు. మా వృత్తుల పట్ల అవహేళన చేసిన వారిని వదిలిపెట్టామని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హెచ్చరించారు. మా జాతులను కించపరిచే విధంగా మాట్లాడితే రాజకీయంగా అణిచివేస్తామన్నారు.