Sridhar Babu: చరిత్రలో గుర్తుండిపోయే పథకాలు అమలు చేశాం
Sridhar Babu: చరిత్రలో గుర్తుండిపోయే సంక్షేమ పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.
Sridhar Babu: చరిత్రలో గుర్తుండిపోయే పథకాలు అమలు చేశాం
Sridhar Babu: చరిత్రలో గుర్తుండిపోయే సంక్షేమ పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఒక్క తెల్లరేషన్ కార్డు కూడా ఇవ్వలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే తెల్లరేషన్ కార్డుల జారీ పునఃప్రారంభమైందని గుర్తుచేశారు.
జూబ్లీహిల్స్‌లో రోడ్ల అభివృద్ధి, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదల ఇవన్నీ కాంగ్రెస్ పాలనలోనే జరిగాయి. బీఆర్‌ఎస్‌కు వీటిలో ఎలాంటి పాత్ర లేదు అని మంత్రి స్పష్టం చేశారు. ఈ నెల 11న జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు మంత్రి శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు.