Seethakka: DNAల గురించి మాట్లాడే నీచస్థాయికి కేటీఆర్ దిగజారారు
Seethakka: పార్టీ ఫిరాయింపులపై బీఆర్‌ఎస్ నాయకులకు మాట్లాడే నైతిక హక్కు లేదని తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క విమర్శించారు.
Seethakka: DNAల గురించి మాట్లాడే నీచస్థాయికి కేటీఆర్ దిగజారారు
Seethakka: పార్టీ ఫిరాయింపులపై బీఆర్‌ఎస్ నాయకులకు మాట్లాడే నైతిక హక్కు లేదని తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క విమర్శించారు. గతంలో బీఆర్‌ఎస్ పార్టీలోకి ఇతర పార్టీల నుంచి 40 మంది ఎమ్మెల్యేలను ఎలా చేర్చుకున్నారో గుర్తుచేసుకోవాలని ఆమె ప్రశ్నించారు. ఎవరు ఏ పార్టీలో చేరినా అది కేవలం అభివృద్ధి కోసమేనని సీతక్క అన్నారు.
ఈ సందర్భంగా ఆమె బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. "డిఎన్‌ఎల గురించి మాట్లాడే నీచస్థాయికి కేటీఆర్ దిగజారారు" అని మంత్రి మండిపడ్డారు. పార్టీ ఫిరాయింపుల విషయంలో బీఆర్‌ఎస్ అనుసరించిన విధానాలను ప్రజలు గమనించారని, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని విమర్శించడం సరికాదని ఆమె స్పష్టం చేశారు.