నేను కేటీఆర్‌కు పెద్ద అభిమానిని : మంత్రి సత్యవతి రాథోడ్

Update: 2020-05-24 07:38 GMT
Satyavathi Rathod

సీజనల్‌ వ్యాధుల నివారణలో భాగంగా పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాల కార్యక్రమంలో రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తమ ఇంట్లో అవసరమయ్యే ఆకుకూరలను, కూరగాయలను తానే స్వయంగా పండిస్తున్నట్లు తెలిపారు. రోజూ తానే ఇంట్లో క్లీనింగ్‌ చేస్తుంటారని, మొక్కలు నీరు పోయడం కూడా చేస్తారని తెలిపారు. మంత్రి రాథోడ్ కేటీఆర్‌కు పెద్ద అభిమానినని తెలిపారు. మన ఇంటినే మనం బాగు చేసుకోలేనప్పుడు బయట ఏం బాగు చేయగలమన్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజలంతా ఎవరింటిని వారు శుభ్రం చేసుకోవడం వల్ల ఆరోగ్యకర సమాజం ఏర్పడుతుందన్నారు.

ఇక ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాల కార్యక్రమంలో భాగంగా మహబూబాబాద్‌లోని మంత్రి నివాసంలో పూల కుండీల్లో ఉన్న నిల్వ నీటిని తొలగించి, కొత్త నీటిని పోసారు. ఇంటి మేడ మీద ఉన్న చెత్తా, చెదారాన్ని తొలగించి శుభ్రం చేసారు. దర్వాజలకు కట్టిన తోరణాల ఎండుటాకులను తీసేశారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు జిల్లా జడ్పీ చైర్ పర్సన్ కుమారి ఆంగోతు బిందు, మునిసిపల్ కమిషనర్ ఇంద్రసేనారెడ్డి, ఎంపీటీసీ మధుకర్ రెడ్డి, టిఆర్ఎస్ నేతలు నూకల శ్రీరంగారెడ్డి, శ్రీనివాసరెడ్డి, శ్రీరామ్ ఇతర నేతలు, అధికారులు పాల్గొన్నారు.


Tags:    

Similar News