Satyavathi Rathod: బీజేపీ రౌడీయిజం, మోడీ ఈడీఇజం తెలంగాణలో నడవదు
Satyavathi Rathod: ఈడీ నోటీసులు వస్తాయని బండి సంజయ్, రఘునందన్‌లకు ఎలా తెలుసు..?
Satyavathi Rathod: బీజేపీ రౌడీయిజం, మోడీ ఈడీఇజం తెలంగాణలో నడవదు
Satyavathi Rathod: బీజేపీ ప్రభుత్వ తీరుపై మంత్రి సత్యవతి రాథోడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ దర్యాప్తు సంస్థలను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని దుయ్యబట్టారు. బీజేపీ తన స్వార్ధం కోసం రాజకీయ అవసరాల కోసం కేంద్ర దర్యాప్తు సంస్థలను వాడుకుంటుందని ఆరోపించారు. బండి సంజయ్, రఘునందన్ రావులకు ఈడి నోటీసులు ఇస్తుందని ముందుగానే ఎలా తెలుసని మంత్రి ప్రశ్నించారు. బీజేపీ రౌడీయిజం మోడీ ఈడీ ఇజం తెలంగాణ లో నడవదని హెచ్చరించారు.