సీఎం జగన్‌ ఆస్తుల కేసులో సీబీఐ కోర్టుకు మంత్రి సబిత

Update: 2020-01-17 04:31 GMT
సీఎం జగన్‌ ఆస్తుల కేసులో సీబీఐ కోర్టుకు మంత్రి సబిత

సీఎం జగన్‌ ఆస్తుల కేసులో ఇవాళ సీబీఐ కోర్టుకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి హాజరుకానున్నారు. పెన్నా సిమెంట్స్‌ వ్యవహారంలో 2013లో సీబీఐ అదనపు ఛార్జ్‌షీట్‌ దాఖలు చేయగా కోర్టు ఇటీవల పరిగణలోకి తీసుకుంది. ఈ వ్యవహారంలో సబితా ఇంద్రారెడ్డి, మాజీ మంత్రి ధర్మాన, పెన్నాప్రతాప్‌రెడ్డి, మాజీ ఐఏఎస్‌ అధికారిణి శ్రీలక్ష్మీ సహా పలువురికి నోటీసులు జారీ చేసింది. అనంతపురం జిల్లాలో 230 ఎకరాలు, కర్నూల్‌లో 304 హెక్టార్లు, రంగారెడ్డి జిల్లాలోని తాండూరులో గనుల కేటాయింపులపై అవకతవకలు జరిగాయని సీబీఐ చార్జ్‌షీట్‌ దాఖలు చేసింది.

Tags:    

Similar News