Puvvada Ajay Kumar: పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పువ్వాడ అజయ్
Puvvada Ajay Kumar: కేసీఆర్ ను గద్దె దింపుతామని పగటి కలలు కంటున్నారు
Puvvada Ajay Kumar: పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పువ్వాడ అజయ్
Puvvada Ajay Kumar: పేదలు ఆత్మగౌరవంతో జీవించేందుకు సీఎం కేసీఆర్ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. నగరంలోని టేకులపల్లి కేసీఆర్ టవర్స్‌లో ....ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. సుమారు 263 మందికి ఇళ్ల పట్టాలను అందజేశారు. కొందరు కళ్లుండి చూడలేని కబోధులు కేసీఆర్ డబుల్ బెడ్ రూమ్‌లు ఎక్కడ అని అడుగుతున్నారని వారంతా ఒక్కసారి టేకులపల్లి కేసీఆర్ టవర్‌కు చూడాలని తెలిపారు. కొందరు కేసీఆర్‌ను గద్దె దింపుతామని పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు.