Ponnam Prabhakar: కేటీఆర్ తానా అంటే..కిషన్ రెడ్డి తందాన అంటారు
Ponnam Prabhakar: బీఆర్ఎస్ మాదిరి కక్ష సాధింపు ధోరణి కాంగ్రెస్ పార్టీకి లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.
Ponnam Prabhakar: కేటీఆర్ తానా అంటే..కిషన్ రెడ్డి తందాన అంటారు
Ponnam Prabhakar: బీఆర్ఎస్ మాదిరి కక్ష సాధింపు ధోరణి కాంగ్రెస్ పార్టీకి లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నేతలు ఇంకా ప్రభుత్వంలోనే ఉన్నాం అనుకోని నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. తప్పు చేస్తే చట్టం తన పని తాను చేస్తుందని వెల్లడించారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కలిసి పని చేస్తున్నాయని మంత్రి ఆరోపించారు.
కేటీఆర్ తానా అంటే, కిషన్ రెడ్డి తందాన అంటారని విమర్శించారు. జూబ్లీహిల్స్ ఎన్నికలలో బీజేపీ పార్టీ డిపాజిట్ తెచ్చుకోవాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి మంత్రి పొన్నం సవాల్ విసిరారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో గెలుస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ దీమా వ్యక్తం చేశారు.