Ponnam Prabhakar: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి పొన్నం
Ponnam Prabhakar: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ క్షమాపణలు చెప్పాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు.
Ponnam Prabhakar: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి పొన్నం
Ponnam Prabhakar: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ క్షమాపణలు చెప్పాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో రేపు జరగబోయే సీఎం రేవంత్ బహిరంగ సభ స్థలాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. హెలిపాడ్ స్థలాన్ని, సమావేశ సభను పరిశీలించి.. సీఎం సభను విజయవంతం చేయాలని నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు.
మిత్రపక్షముకు బాధ్యత వహిస్తున్న తెలంగాణ బీజేపీ నాయకత్వం పవన్ వ్యాఖ్యలపై స్పందించాలని కోరారు. ఏపీలో తుఫాన్ వచ్చి అక్కడక్కడ చెట్లు ఎండిపోతే మా దిష్టి తగిలిందని నిందిస్తే.. అది తెలంగాణ ప్రజలకు అవమానకరమని అన్నారు. వెంటనే పవన్ కల్యాణ్ తన మాటలు ఉపసంహరించుకోవాలని, క్షమాపణ చెప్పాలని కోరారు.