Mallareddy: బాటిల్‌పై క్లారిటీ.. ఎవరో దొంగచాటుగా..
Mallareddy: మునుగోడులో లిక్కర్ బాటిల్‌తో వైరల్ అయిన తన ఫొటోపై మంత్రి మల్లారెడ్డి తీవ్రంగా మండిపడ్డారు.
Mallareddy: బాటిల్‌పై క్లారిటీ.. ఎవరో దొంగచాటుగా..
Mallareddy: మునుగోడులో లిక్కర్ బాటిల్‌తో వైరల్ అయిన తన ఫొటోపై మంత్రి మల్లారెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. తన బంధువుల ఇంటికి చాలాకాలం తరువాత వెళ్లానని..కుటుంబ సభ్యులతో కలిసి కూర్చున్నప్పుడు మందు పోశానని..అయితే ఎవరో దొంగచాటుగా ఫొటోలు తీస్తే బీజేపీ, కాంగ్రెస్ నేతలు దాన్ని అడ్డం పెట్టుకొని మాట్లాడడం సరికాదన్నారు. మునుగోడులో గెలవలేక ప్రతిపక్షాలు ఇలాంటి చీప్ ట్రిక్కులకు పాల్పడుతున్నాయని, దమ్ముంటే క్షేత్రస్థాయిలో పోరాడి గెలవాలని మంత్రి మల్లారెడ్డి సవాల్ విసిరారు. మునుగోడులో గెలిచేది టీఆర్‌ఎస్సేనని అందులో ఎలాంటి అనుమానం లేదన్నారు. మునుగోడు ప్రజలు ఇప్పటికే కూసుకుంట్లను గెలిపించాలని ఫిక్స్ అయ్యారని మంత్రి మల్లారెడ్డి తెలిపారు.