KTR: మా పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా దక్కేదెప్పుడు?

KTR: మా ప్రాజెక్టుకు జాతీయ హోదాను తుంగలో తొక్కారు

Update: 2023-10-03 05:56 GMT

KTR: మా పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా దక్కేదెప్పుడు?

KTR: ప్రధాని మోడీకి మంత్రి కేటీఆర్‌ ట్వీట్టర్ వేదికగా ప్రశ్నలు సంధించారు. మా మూడు ప్రధాన హామీల సంగతేంటని.. కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీకి ప్రాణం పోసేదెప్పుడు..?.. మా బయ్యారం ఉక్క కర్మాగారం నిర్మించేదెప్పుడు..?.. మా పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా దక్కేదెప్పుడని ప్రశ్నించారు మంత్రి కేటీఆర్. మూడు రోజుల వ్యవధిలో రెండోసారి వస్తున్నారు.. మరి ఆ మూడు విభజన హక్కులకు దిక్కేదన్నారు. ఇంకా ఎంతకాలం ఈ అబద్ధాల జాతర?.. మీ మనసు కరిగేదెప్పుడు.. తెలంగాణ గోస తీరేదెప్పుడు?.. గుండెల్లో గుజరాత్‌ను పెట్టుకుని తెలంగాణ గుండెల్లో గునపాలా? అంటూ ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.కోచ్‌ ఫ్యాక్టరీ, ఉక్కు కర్మాగారం ఊపిరి తీశారు.. లక్షల ఉద్యోగాలిచ్చే ఐటీఐఆర్‌ను ఆగం చేశారు.. మా ప్రాజెక్టుకు జాతీయ హోదాను తుంగలో తొక్కారని ఫైరయ్యారు.


Tags:    

Similar News