అన్నపూర్ణ కేంద్రాల్లో నేటి నుంచి ఉచిత భోజనం..

తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతుండటంతో ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించింది.

Update: 2020-03-26 05:33 GMT
Minister KTR

తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతుండటంతో ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించింది. దీంతో రాష్ట్రమంతా ఎక్కడికక్కడ నిర్మాణుష్యంగా మారిపోయింది. షాపులు, కార్యాలయాలు, బస్సులు, రైల్లు, విమానాలు అన్నీ బంద్ అయ్యాయి. వాటితో పాటుగానే ప్రతి రోజు ఎంతో మంది పేద ప్రజల ఆకలి తీర్చే అన్నపూర్ణ కేంద్రాలు కూడా మూత పడ్డాయి. దీంతో చాలా మంది పేదలు, వృద్దులు ఆకలికి అలమటించి పోతున్నారు.

కాగా తెలంగాణ మంత్రి కేటీఆర్, హైదరాబాద్ మహా నగర పాలక సంస్థ ఈ విషయంపై చర్చలు జరిపి ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. అన్న పూర్ణ కేంద్రాలను యథావిధిగా కొనసాగించాలని నిర్ణయించుకన్నారు. అంతే కాదు ఇంతకు ముందులాగా రూ.5కి భోజనం కాకుండా ఆకలితో అలమటించి పోయే పేదలకు, వృద్దులకు అన్నపూర్ణ కేంద్రాల్లో ఉచితంగా భోజనం అందించాలని నిర్ణయం తీసుకున్నారు. ముందుగా లాక్‌డౌన్ సందర్భంగా అన్నపూర్ణ కేంద్రాలను మూసివేయాలనకున్నార తరువాత కొంత మంది పరిస్థితిని గమనించిన మంత్రి కేటీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు అంటే గురువారం రోజు నుంచి నగరంలోని 150 అన్నపూర్ణ కేంద్రాలలో ఉచిత భోజన వసతులు అమలులోకి రానున్నాయని నగర మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ఆదేశాల మేరకుఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. అంతే కాక ఇప్పటి వరకూ హాస్టళ్లలోనే చిక్కుకుపోయిన వారికి కూడా జీహెచ్‌ఎంసీ తరపున ఉచితంగా భోజనం అందిస్తామని ఆయన అన్నారు.

ఇక పోతే లాక్ డౌన్ కారణంగా ఇతర రాష్ట్రాల నుంచి రవాణా లేకపోవడతో కూరగాయల కొరత ఏర్పడుతుంది. దీంతో అమ్మకం దారులు అమాంతం కూరగాయల ధరలు పెంచారు. దీంతో సామాన్యలు కూరగాయలు అంటేనే భయపడేట్టు ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ విషయంలో ప్రభుత్వం కల్పించుకుని సరకులు, కూరగాయల వంటివి కాలనీలకే పింపిస్తామని ఆయన తెలిపారు.

Tags:    

Similar News