KTR: రాష్ట్రాలపై కక్ష సాధింపు కోసమే గవర్నర్లను వాడుకుంటున్నారు

KTR: ఇదేనా అభివృద్ధికి సహాయపడే సహకార సమాఖ్య నమూనా..?

Update: 2023-04-11 06:48 GMT

KTR: రాష్ట్రాలపై కక్ష సాధింపు కోసమే గవర్నర్లను వాడుకుంటున్నారు

KTR: మోడీ సర్కార్ పై ట్విట్టర్ వేదికగా మరోసారి విరుచుకుపడ్డారు మంత్రి కేటీఆర్.. నాన్ బీజేపీ రాష్ట్రాల ప‌ట్ల కేంద్రం అనుస‌రిస్తున్న వైఖ‌రిని మంత్రి కేటీఆర్ తప్పుబట్టారు. ఆ రాష్ట్రాల‌పై ప్రతీకారేచ్ఛతో కేంద్రం వ్యవ‌హ‌రిస్తోందని ఆయ‌న ఆరోపించారు. ఇక రాజ్యాంగ‌ప‌ర‌మైన ఉన్నత‌ ప‌ద‌వుల్లో ఉన్నవారు..కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో రాజ‌కీయ పావులుగా మారారని విమ‌ర్శించారు.

గవర్నర్ తీరుపై తమిళనాడు ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రస్తావిస్తూ ట్వీట్ చేశారు కేటీఆర్. బీజేపీయేతర రాష్ట్రాలపై కేంద్రం చూపుతున్న వివక్ష స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఇది దేశ అభివృద్ధికి సహాయపడే సహకార సమాఖ్య నమూనానా? ఇదేనా టీమ్ ఇండియా స్ఫూర్తి? అంటూ విరుచుకుపడ్డారు కేటీఆర్.


Tags:    

Similar News