Harish Rao: సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతోంది
Harish Rao: డబుల్ లేన్, బైపాస్ రోడ్డులతో కొత్త అందం వచ్చింది
Harish Rao: సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతోంది
Harish Rao: సిద్ధిపేట రూరల్ మండలం పుల్లూరు గ్రామంలో నూతన పోచమ్మ దేవాలయ విగ్రహ ప్రతిష్టలో మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. అనంతరం గ్రామ నాభిశిల ప్రతిష్టకు హాజరై ప్రత్యేక పూజలు చేశారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎన్నో ఇబ్బందులు ఉండేవని.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ నాయకత్వంలో దక్షిణ భారతదేశ ధాన్యాగారంగా తెలంగాణ మారిందన్నారు.
తెలంగాణ వచ్చాక పుల్లూరును అన్ని రకాల అభివృద్ధి చేశామని తెలిపారు హరీశ్ రావు. పుల్లూరు గ్రామానికి డబుల్ లేన్, బైపాస్ రోడ్డు రావడంతో సరికొత్త అందమొచ్చిందని.. రానున్న వారం రోజుల్లో 2 కోట్ల వ్యయంతో గ్రామ ఎస్సీ కాలనీ నుంచి రామంచ వెళ్లే రహదారికి పనులు ప్రారంభం చేసుకుందామని తెలిపారు.