తెలంగాణలో కరోనా వైరస్‌ లేదు: మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు

కరోనా వ్యాపించకుండా అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు ప్రజలను హెచ్చరించారు.

Update: 2020-03-18 11:58 GMT
Errabelli Dayakar Rao visits Parvathagiri

కరోనా వ్యాపించకుండా అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు ప్రజలను హెచ్చరించారు. వరంగల్‌ రూరల్‌ జిల్లా వర్దన్నపేట నియోజకవర్గం పర్వతగిరిలో ఈ రోజు మంత్రి పర్యటించారు. గ్రామంలో ఉన్న అభివృద్ది పనులను ఆయన పరిశీలించారు. అనంతరం అక్కడి ప్రజలతో మాట్లాడి సమస్యల గురించి తెలుసుకున్నారు. వారి సమస్యలను వెంటనే పరిష్కరించేల చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ భారత దేశంలో పుట్టింది కాదని అది విదేశాల నుంచి భారత్ కు, తెలంగాణకు వ్యాపిస్తుందని తెలిపారు. తెలంగాణలో వైరస్ లేదని అన్నారు. రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ రాష్ట్రంలో వైరస్‌ విజృంభించకుండా అన్ని చర్యలు అమలు చేపిస్తున్నారి తెలిపారు. దగ్గు, జలుబు, జ్వరం వచ్చిన వాళ్లు మిగతా వాళ్లకు దూరంగా ఉండాలని, ఆస్పత్రుల్లో పరీక్షలు చేపించుకోవాలని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలు భయభ్రాంతులకు గురికావాల్సిన అవసరం లేదని ఆయన ధైర్యం చెప్పారు.

గుంపులు గుంపులుగా ప్రజలు తిరగరాదన్నారు. వైద్యులు చెప్పిన సలహాలు, సూచనలను పాటించాలి తెలిపారు. ప్రజలు కొంతకాలం పాటు కొన్ని పనులను వాయిదా వేసుకోవాలన్నారు. వైరస్‌ సోకిన వారితో పాటు వ్యాధి సోకకుండా ప్రజలు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. మనం శుభ్రంగా ఉండటంతో పాటు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. అప్పుడే ఎలాంటి క్రిమి కీటకాలు, వైరస్ లు తమ దరికి చేరవని అన్నారు. ఈ కార్యక్రమంలో వర్దన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌, స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.


Tags:    

Similar News