రైతు సమస్యలపై పోరాటానికి సిద్ధమవుతున్న కాంగ్రెస్

*గాంధీ భవన్ లో రైతుసమస్యలపై సమావేశం *టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సమావేశం

Update: 2022-03-04 06:00 GMT

గాంధీ భవన్ లో రైతుసమస్యలపై సమావేశం

Gandhi Bhavan: రైతు సమస్యలపై పోరాడేందుకు సిద్ధమవుతున్నారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు. రైతు సమస్యలపై గాంధీభవన్ లో సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పై చర్చించారు. రైతులకు అండగా నిలబడేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. రాష్ట్రంలో వరి పంటతో పాటు నిజామాబాద్ లో నిజాం షుగర్ ఫ్యాక్టరీ, పసుపు, ఖమ్మంలో మిర్చి తదితర అంశాలపై పోరాటం చేయాలని గుర్తించారు. వ్యవసాయానికి సంబంధించిన అంశాలపై అసెంబ్లీ సమావేశాల్లో షార్ట్ డిస్కషన్ కోసం పట్టుబట్టాలని నిర్ణయించారు.

వరి దాన్యానికి సంబంధించిన సమస్యలపై క్షేత్ర స్థాయిలో పోరాటానికి రూపకల్పన చేయాలని నేతలు టిపిసిసి అధ్యక్షుడి దృష్టికి తెచ్చారు. పంట నష్టంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను నిలదీయాలని.. రైతులకు పరిహారం దక్కేవరకు పోరాడాలని నిర్ణయించారు. రైతులకు పరిహారం చెల్లించాలని కోర్టు సూచించినా రైతులకు న్యాయం జరగలేదన్నారు నేతలు. గత జనవరిలో వరంగల్ ప్రాంతంలో వడగళ్ల వానకు మిర్చి పంట దెబ్బతిన్నది. రైతులకు ఇప్పటి వరకు ఎలాంట సాయం అందలేదని కాంగ్రెస్ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. మిర్చి రైతులకు పరిహారం కోసం న్యాయ పోరాటం చేయాలని సూచించారు. ఈనెల 6న అసెంబ్లీ లో అనుసరించాల్సిన వ్యూహంపై ముఖ్య నేతల సమావేశం ఉంటుందని ఈనెల 13 కొల్లాపూర్ లో జరిగే మన ఊరు మన పోరు సభలో వరి కొనుగోళ్ళలో ప్రభుత్వం తీసుకునే చర్యలపై చర్చిస్తామన్నారు టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను మండలాల వారీగా ఏర్పాటుచేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

Tags:    

Similar News