Malla Reedy: తెలంగాణను మాజీ సీఎం కేసీఆర్ ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దారు
Malla Reedy: మౌలిక సదుపాయాల కల్పనకు కేసీఆర్ ఎంతో కృషి చేశారు
Malla Reedy: తెలంగాణను మాజీ సీఎం కేసీఆర్ ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దారు
Malla Reedy: గణతంత్ర దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పరిధి బోయిన్‌పల్లిలోని తన నివాసం వద్ద మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన గొప్ప రోజుగా గణతంత్ర వేడుకలు నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే ఆదర్శవంత రాష్ట్రంగా తీర్చిదిద్దారని, పేద ప్రజలకు కావలసిన మౌలిక సదుపాయాలను కల్పించిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందని ఆయన అన్నారు.