Medaram Jatara: మేడారం జాతరలో ఇవాళ కీలక ఘట్టం

Medaram Jatara: చిలుకల గుట్ట నుంచి మేడారం గద్దెలపైకి సమ్మక్క రాక

Update: 2024-02-22 03:21 GMT

Medaram Jatara: మేడారం జాతరలో ఇవాళ కీలక ఘట్టం

Medaram Jatara: మేడారం జనసంద్రమైంది. మేడారం జాతరలో ఇవాళ కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. చిలుకల గుట్ట నుంచి మేడారం గద్దెలపైకి సమ్మక్క రాక కోసం భక్తులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. చిలుకలగుట్టపై నుంచి కుంకుమభరిణె రూపంలో ఉండే సమ్మక్కను పూజారి కొక్కెర కిష్టయ్య అధికార లాంఛనాలు మధ్య తీసుకువచ్చి రాత్రి గద్దెపై ప్రతిష్టించనున్నారు. ఇప్పటికే చిలుకలగుట్ట వద్ద ఆదివాసీలు రహస్య పూజలు నిర్వహించారు.

ఇప్పటికే కన్నెపల్లి నుంచి సారలమ్మ అమ్మవారిని ఆదివాసీ పూజారులు డోలు వాయిద్యాలతో తోడ్కోని వచ్చి గద్దెలపై ప్రతిష్టించారు. పగిడిద్ద రాజు, గోవిందరాజులను గద్దెలపై కొలువుదీరారు. కీలకఘట్టమైన సారలమ్మ ఆగమనం నేపథ్యంలో వనం మొత్తం జనంతో నిండిపోయింది. సమ్మక్క రాక నేపథ్యంలో భక్తుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.

Tags:    

Similar News