మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిపై హత్యాయత్నం.. కత్తితో దాడి..
Kotha Prabhakar Reddy: గజ్వేల్ ప్రభుత్వాస్పత్రికి ప్రభాకర్‌రెడ్డి తరలింపు
మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిపై హత్యాయత్నం.. కత్తితో దాడి.. కడుపులో గాయం
Kotha Prabhakar Reddy: మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిపై కత్తితో దాడి జరిగింది. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రభాకర్‌రెడ్డిపై కత్తితో దాడిచేశాడు ఓ అగంతకుడు. దౌల్తాబాద్ మండలం సూరంపల్లిలో ఘటన జరిగింది. కత్తితో దాడిలో ప్రభాకర్‌రెడ్డికి తీవ్రగాయాలు కాగా.. అతడిని గజ్వేల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే.. దాడి అనంతరం పారిపోతున్న వ్యక్తిని.. బీఆర్ఎస్ కార్యకర్తలు చుట్టుముట్టి దాడి చేశారు. నిందితుడు మిడిదొడ్డి మండలం చెప్యాల గ్రామానికి చెందిన రాజుగా గుర్తించారు.