Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై నుంచి దుర్గం చెరువులో దూకి వ్యక్తి ఆత్మహత్య!
Cable Bridge: గాలింపు చర్యలు చేపట్టిన DRF సిబ్బంది
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై నుంచి దుర్గం చెరువులో దూకి వ్యక్తి ఆత్మహత్య!
Cable Bridge: హైదరాబాద్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి వద్ద విషాద ఘటన చోటుచేసుకుంది. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై నుండి దూకి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు, DRF సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. 12 మంది సిబ్బంది మృతదేహం కోసం గాలిస్తున్నట్లు DRF స్టేషన్ ఫైర్ ఆఫీసర్ శౌకత్ తెలిపారు. బాడీ పైకి తేలేందుకు 12 నుంచి 16 గంటల సమయం పడుతుందన్నారు. చెరువులో బోట్ స్పీడ్‌గా రొటేట్ చేయడం ద్వారా బాడీ పైకి తేలే అవకాశం ఉందని DRF ఆఫీసర్ శౌకత్ అన్నారు.